శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆశయాలు మరియు లక్ష్యాలు
సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు
- హిందూ ధర్మ ప్రచారం .
- సనాతన ధర్మ పరిరక్షణ మరియు హిందూ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల గురించి ప్రజలకు తెలియజేయుట ద్వారా చైతన్యం పెంపొందించుట.
- లోక కళ్యాణార్థం హోమ, వ్రత అభిషేకాల, నిర్వహణ కుల ప్రసక్తి లేకుండా హిందువులు అందర్నీ భాగస్వాములను చేయుట.
- గో సంరక్షణ , గోశాల ల నిర్వహణ మరియు గోశాల లకు సహాయ సహకారాలు అందించుట, గో ఉత్పుత్తులను ప్రోత్సహించుట.
- పండుగలు, పర్వదిన సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ చేయుట.
- ప్రాచీన దేవాలయాలు మరియు శిధిల దేవాలయాల పునరుద్ధరణ పున: నిర్మాణం ,జీర్ణోదరణ చేయబడుచున్న దేవాలయాలకు ట్రస్టు ద్వారా తగు సహాయ సహకారాలు అందించుట.
- పేద గర్భిణీ స్త్రీలకు ఉచితంగా సీమంత వేడుకలు నిర్వహించుట.
- హిందూ పండుగలు, పర్వదినాలు మరియు ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ.


వైద్య ఆరోగ్య సేవలు
- అవసరమైన వారికి ఉచిత వైద్య పరీక్షల ద్వారా ఆరోగ్య సంరక్షణ కల్పించుట.
- చిన్నపిల్లలు కౌమార యవ్వన దశలో ఉన్నవారికి శారీరక మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించుట.
- మానసిక ఆరోగ్యం కొరకు ఉచిత యోగ మరియు ధ్యాన శిబిరంలో నిర్వహించుట.

సమాజ హిత అభివృద్ధి కార్యక్రమాలు
- ప్రతిభ గల పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పుస్తక పంపిణీ మరియు సహాయం అందించుట.
- ప్రకృతి విపత్తులలో చిక్కుకున్న వారికి వైద్యము ఆహారము తాత్కాలిక పునరావాసం కల్పించుట.
- అవసరమైన వారికి మంచి తాగు నీరు అందించే కార్యక్రమాలకి తోడ్పాటు అందించుట.
- వైద్య సదుపాయాలు లేని పల్లెటూరులో ఉన్నవారికి వైద్య సేవలు కల్పన.
- వేసవి కాలమునందు చలి వేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుట.

దివ్యాంగులకు వృద్ధులకు ప్రత్యేక సేవా కార్యక్రమాలు.
అంగవైకల్యం కలవారికి ఆర్థిక స్వావలంబన చేయూత కల్పించుట.
అంధులకు మరియు బధిరులకు స్వయం వ్యక్తిత్వ అభివృద్ధి కల్పన, అవసరమైన వారికి సహాయం అందించుట.
వృద్ధాశ్రమాలకు అనాధ ఆశ్రమాలకు అవసరమైన వస్తు సేకరణ మరియు వితరణ చేయుట
